మనమంతా ప్రశాంత వాతావరణంలో జీవనానికి సైనికులే కారణం

  . . . సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ లో కలెక్టర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెళ్లదీస్తున్నామని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాన్ని  పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం నుండి చేపట్టి...