మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలంలో ఉన్న నేలలు ఆయిల్ ఫామ్ పంట సాగుకు చాలా అనుకూలమైన నేలలు ఉన్నాయని వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ అన్నారు. మోర్తాడ్ లో ఆయిల్ ఫామ్ పంట పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ పంటను కోసిన 24 గంటల లోపు పంట అమ్మడం పూర్తి అవుతుంది. గాలివాన , గాలిదుమారం ఏవీ ఈ పంటను ఏమీ చేయలేవు. ఏ పంటకి లేని ప్రత్యేకత : ఈ పంట కి ఒక చట్టం చేయబడింది. అమ్మకం కొనుగోలు అంతా చట్ట పరిధి ప్రకారం జరుగుతుంది. ఆయిల్ పామ్ పంట దిగుబడి 4వ సంవత్సరం నుండి మొదలై 35 నుండి 40 సంవత్సరాల వరకు ప్రతి 15 రోజులకీ ఒకసారి దిగుబడి ఇస్తుంది. మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలు వేసుకొని ఆదాయం పొందవచ్చు. మొదటి 4 సంవత్సరాల వరకు ఒక ఎకరానికి రూ.4200/- చొప్పున రూ.16800/ ప్రభుత్వం పెట్టుబడి సహాయ రూపం లో ఇస్తుంది. ఈ పంటను ఉపాధి హామీ పథకం లో బాగంగా మొక్కలు నాట్కోవచ్చు మీరు కట్టిన DD రూపాయలు, గుంత తీసి మొక్క నాటడం,మొక్క రవాణా ఖర్చుతో పాటు గా 3 సంవత్సరాల వరకు ఎరువుల ఖర్చులు, మెయింటెనెన్స్ కూడా ఇస్తారు.) ఆయిల్ పామ్ మొక్కలను 90% ప్రభుత్వ రాయితీ తో కేవలం 20 రూపాయలకి ఒక మొక్క చొప్పున ఎకరానికి 50 మొక్కలు 1000/- రూపాయలకి సరఫరా చేస్తున్నాం. ఈ పంటకు బిందు సేద్య పరికరాలు 80-100% వరకు సబ్సిడి పొందవచ్చని తెలిపారు. కూలీల అవసరం అంతగా ఉండదు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని తెలియజేశారు. పంట వేయదలచిన రైతులు మీ దగ్గరలోని ఏ ఈ వై ను గానీ, ఏపీవో ను గానీ, సంప్రదించగలరు. కార్యక్రమంలో మండల వ్యవసాయ ఆదికారి హరీష్ కుమార్, ఉద్యాన శాఖ ఆదికారి రాజగౌడ్, వ్యవసాయ విస్తీర్ణ ఆదికారి శ్రీలత కంపెనీ మేనేజర్ సాయికిరణ్, క్లస్టర్ ఆఫీసర్ ప్రేమసింగ్, రైతులు పాల్గొన్నారు.