ప్రగతిశీల విద్యార్థుల కోసం సమాజం ఎదురుచూస్తోంది

ఫ్రొఫెసర్ ఎ.వినాయక రెడ్డి   ఆర్మూర్, బతుకమ్మ : సమాజంలో అసమానతలు పెరిగిపోయాయని, పాఠ్యాంశాలలో హేతువాద, లౌకిక భావాలను తొరగిస్తున్నారని సమాజానికి ప్రగతి శీల విద్యార్థుల అవసరం ఉందని ప్రొ.వినాయక రెడ్డి అన్నారు. పి డి ఎస్ యూ  23 వ నిజామాబాద్ జిల్లా మహాసభల సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో సి కన్వెన్షన్ లో ప్రతినిధుల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొఠారి కమీషన్ సిఫారసు ప్రకారం విద్యకు సరిపడా నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం...