గుండెపోటుతో సొసైటీ డైరెక్టర్ మృతి

నందిపేట్, బతుకమ్మ: మండలంలోని అయిలాపూర్ ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ మహ్మద్ హుస్సేన్(65) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. హుస్సేన్ స్వగ్రామం వెల్మల్.  అయిలాపూర్ సొసైటీ డైరెక్టర్ ఒకరు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం మరో డైరెక్టర్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు.