Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2024, 11:56 am Posted by : ramakrishna

పురుగుల మందు తాగి సొసైటీ డైరెక్టర్ ఆత్మహత్య

నందిపేట్, బతుకమ్మ:

కుటుంబ కలహలతో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ పురుగుల మందు తాగి అత్మహత్యయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన నందిపేట్ పొలిస్ లు కేసు నమోదు చేయడంతో వెలుగు చూసింది. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన గాంధారి రాజలింగం ( 55 ) ఈ నెల 5న పురుగుల మందు తాగి అత్మహత్యాయత్నం  చేశాడు. కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతు సొమవారం రాత్రి మృతి చెందాడు. రాజలింగం నందిపేట్ మండలం  ఐలాపూర్ పిఎసీఎస్ సొసైటి డైరెక్టర్ గా ఉన్నారు. రాజలింగం అత్మహత్యకు కుటుంబ కలహాలే కారణం అని తెలిసింది. నందిపేట్ పోలిస్ లు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.