Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 11:31 pm Posted by : ramakrishna

హైకోర్టు స్టేతో మళ్ళీ అందలమెక్కిన సొసైటీ చైర్మన్లు

  • కోర్టు స్టే ఇచ్చిన కంటిన్యూ ఆర్డర్ ఇవ్వని ప్రభుత్వం
  • ఆర్డర్ ఇవ్వకున్నా స్టే ఆధారంగా వారికి వారే పదవి బాధ్యతలు తీసుకున్న చైర్మన్లు
  • కోర్టు ఆదేశాలను ప్రభుత్వం బేఖాతారు చేస్తోందన్నంటున్న బాధిత చైర్మన్లు
  • ఇన్ బలాన్స్ కింది చైర్మన్లను పక్కన బెట్టిన ప్రభుత్వం కారకులైన సీఈఓ లను ఏం చేస్తోంది

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా కాలం ముగిసిన సొసైటీల పాలకవర్గంకు ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ. ఓ జారీ చేసిన విధితమే. కాగా అందులో వివిధ రూపాల్లో చెల్లింపుల విషయంలో బకాయి పడి నష్టాల్లో ఉన్న సొసైటీలను డిఫల్ట్ సొసైటీల పేరిట ఉమ్మడి జిల్లాలో ఆయా డిఫల్ట్ సొసైటీల పాలకవర్గాలకు కొనసాగింపు ఆర్డర్ ను ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే ఈ నష్టాలు, చెల్లింపులు గత పాలకవర్గం చేసిన డిఫల్ట్ అని, వ్యక్తగత ఋణ బకాయిలు లేని చైర్మన్లు, డైరెక్టర్లు కొనసాగింపు ఆర్డర్ తమకు ఇవ్వలేదంటూ ఉమ్మడి జిల్లాలకు చెందిన 25 మంది చైర్మన్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో గత సెప్టెంబర్ 27న హైకోర్టు అందరితో పాటుగా వీరందరికి కూడా కొనసాగింపు ఆర్డర్ ను ఇచ్చి ఆరు నెలలు పదవిలో కొనసాగించాలని స్టే ఇచ్చింది. ఈ బాధిత చైర్మనులకు హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కాపీని పట్టుకొని ప్రభుత్వ ఆర్డర్ కాపీ కోసం దాదాపుగా నెల రోజుల వరకు వేచి చూసారు. అయిన వారికి కొనసాగింపు ఆర్డర్ కాపీని ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వలేదు. దాంతో చూసి చూసి ఓపిక నశించిన బాధిత చైర్మన్లు వారికి వారిగా, వారికి హైకోర్టు ఇచ్చిన స్టే ఆధారంగా ఈనెల 24 న తమ తమ పదవుల్లో చేరారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన స్టే ను కూడా ప్రభుత్వం బేఖాతారు చేస్తోందని, ఇంకా ఆర్డర్ కాపీ ఇవ్వకపోతే మా కొనసాగింపు దేవుడెరుగు తాము మల్లీ ప్రభుత్వం పై కంటోన్మెంట్ అఫ్ కోర్టు కి కింద హైకోర్టు ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతామని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని సొసైటీలల్లో ఉన్న చైర్మన్లు అధికంగా ప్రతిపక్ష బీయర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండడంతో అధికార పార్టీ నాయకులు కక్షకట్టి అధికారులపై ఒత్తిడి పెట్టి స్టే వచ్చిన కొనసాగింపు ఆర్డర్ కాపీని ఇవ్వకుండా అడ్డుకొంటున్నరని భాదిత పాలకవర్గం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆరు నెలలు పొడగిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా డిఫల్ట్, ఇన్ బాలన్స్ పేరిట లేనిపోని కొర్రీలు పెట్టి ఈ కొనగింపును ఆపడం వెనుక గల ఆంతర్యం  అట్టే తెలిసిపోతుందనే వారు అంటున్నారు. నిజంగా ఎవరైనా చైర్మన్లు, డైరెక్టర్లు డిఫాల్ట్ ఉంటే అలాంటి వారిపై చర్యలు తీసుకొవాలని, రికవరీ చెయ్యాలని వారు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ చైర్మన్లు, డైరెక్టర్లు పాలకవర్గంను అధికార పార్టీ ఒత్తిడి కారణంగానే డిఫల్ట్ అని, ఇన్ బాలన్స్ అని చెప్పి కొర్రీలు పెట్టి పదవి కొనసాగింపు ఆపారన్న బాధిత చైర్మన్ల ఆరోపణల నేపత్యంలో ప్రభుత్వం ఇన్ బాలన్స్ చూపిన సొసైటీ లను 51 ఎంక్వయిరీ కింద బకాయి తెలిన సీఈఓలను తొలగిస్తారా లేక పక్కన పెడతారా చూడాలి మరి.