Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 9:10 pm Posted by : ramakrishna

సోషల్ టాలెంట్ టెస్ట్

నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండల స్థాయిలో సోమవారం సోషల్ ట్యాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో తెలుగు మీడియం నుండి మొదటి స్థానం మల్లూరు జడ్పీహెచ్ఎస్ కు చెందిన వి.అంజన సౌమ్య. ద్వితీయ స్థానం నిజాంసాగర్ జీఎచ్ఎస్ కు చెందిన బి.భానుప్రియ, తృతీయ స్థానం అచ్చంపేట్ జడ్పీహెచ్ఎస్ కు చెందిన బి.దీపక్ సాధించారు. ఇంగ్లీష్ మీడియం నుండి మొదటి స్థానం అచ్చంపేట్ టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ కు చెందిన ఎం. గజానంద్, ద్వితీయ స్థానం అచ్చంపేట్ టీజీఎంఎస్ కు చెందిన కె. హరిప్రియ, తృతీయ స్థానం అచ్చంపేట్ టీజీఎంఎస్ కు చెందిన జి.శివరాం, నిజాంసాగర్ కేజీబీవీకి చెందిన  పి. సాధించారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల విద్యాధికారి వై. తిరుపతి రెడ్డి, మొహమ్మద్ నగర్ మండల అధికాకారి అమర్ సింగ్,  జీఎచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎన్.రాంచందర్, ఉపాద్యాయులు సమత, శైలజ గౌస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.