Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 6:32 pm Posted by : ramakrishna

వెంచిర్యాలో సోషల్ ఆడిట్ గ్రామసభ

ముప్కాల్, బతుకమ్మ : మండలంలోని వెంచిర్యాల్ గ్రామంలో శనివారం మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా సోషల్ అడిట్  గ్రామ సభను డి ఆర్ పీ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సంవత్సరంలో ఉపాధిహామీ ద్వారా నిర్వహించిన పనులకు సంబంధించిన వివిధ రకాల పనుల వివరాలను పంచాయతీ కార్యదర్శి హనుమాన్లు చదివి వినిపించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ వినయ్, ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు మహేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.