Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 4:24 pm Posted by : ramakrishna

ఎస్సారెస్పీ లోకి స్వల్ప ఇన్ ఫ్లో

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి 2083 క్యూసెక్కుల స్వల్ప ఇన్ ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. జూన్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు 1.047 టి ఎం సి నీరు వచ్చి చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం  1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా బుధవారం  ప్రాజెక్టులో 1062.70 అడుగులు, 13.253 టీఎంసీల నీరు నిలువ ఉంది. గత సంవత్సరం ప్రాజెక్టులు ఇదే రోజు 1056.50 అడుగులు, 7.627 టీఎంసీల నీరు ఉంది.