ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగంలో స్కెలెటన్ ఆవిష్కరణ
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగంలో శుక్రవారం స్కెలెటన్ (అస్థి పంజరం) ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ డా. ఈ. లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఏ. ప్రభాకర్ రావు జంతుశాస్త్ర విభాగానికి స్కెలెటన్‌ను (అస్థి పంజరం) విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా జువాలజీ విభాగానికి చెందిన జి.రాణి, ఎం. కిరణ్ కుమార్ దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్...