Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 7:23 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగంలో స్కెలెటన్ ఆవిష్కరణ

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగంలో శుక్రవారం స్కెలెటన్ (అస్థి పంజరం) ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ డా. ఈ. లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఏ. ప్రభాకర్ రావు జంతుశాస్త్ర విభాగానికి స్కెలెటన్‌ను (అస్థి పంజరం) విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా జువాలజీ విభాగానికి చెందిన జి.రాణి, ఎం. కిరణ్ కుమార్ దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.చంద్రకాంత్, ఐక్యూ ఏసీ సమన్వయకర్త డాక్టర్ వి శంకరయ్య, టి ఎస్ కే సి సమన్వయకర్త శివకుమార్, ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎస్.చంద్రకాంత్, నాగనిక డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ సిద్దిరాజు, డాక్టర్ గంగారెడ్డి శశిధర్, సురేష్ రెడ్డి, మోహిన్ సంగీత, కిరణ్ కుమార్, స్వప్న మహిముద్, వసంత లక్ష్మి, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.