ఒడిశాలో ఘటన
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఇంజెక్షన్ వికటించడంతో ఆరుగురు రోగులు మృతి చెందిన ఒడిశాలో కలకలం రేపింది. కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నిముషాల ముందు ఆస్పత్రిలోని నర్సు వేసిన రెండో రౌండ్ ఇంజెక్షన్ కారణంగానే వీరు చనిపోయినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోగుల మృతి కి కారణాలు పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతన్నారు.