మహిళలపై దాడి చేసిన తండ్రీ కొడుకులకు ఆరు నెలల జైలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని కళ్ళెడ గ్రామానికి చెందిన రొడ్డ గంగరామ్, రొడ్డ ప్రశాంత్ గ్రామ శివారులోని వారి చేను పక్కన ఉన్న ఎడ్ల గంగు చేనులోని చెట్టును ఎందుకు కొట్టివేశారని అడిగినందుకు ఎడ్ల గంగా, ఎడ్ల భారతి, ఎడ్ల యమున లపై 26 మే 2014 న కట్టెలతో కొట్టి గాయపర్చారు. ఈ మేరకు మాక్లూర్ పోలిసు లు కేసు నమోదు చేసి తండ్రి కోడుకులను రిమాండ్ కు పంపించారు. ఈ ఘటనలో యమున చేయి విరిగిందనే నేరారోపణ...