నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని కళ్ళెడ గ్రామానికి చెందిన రొడ్డ గంగరామ్, రొడ్డ ప్రశాంత్ గ్రామ శివారులోని వారి చేను పక్కన ఉన్న ఎడ్ల గంగు చేనులోని చెట్టును ఎందుకు కొట్టివేశారని అడిగినందుకు ఎడ్ల గంగా, ఎడ్ల భారతి, ఎడ్ల యమున లపై 26 మే 2014 న కట్టెలతో కొట్టి గాయపర్చారు. ఈ మేరకు మాక్లూర్ పోలిసు లు కేసు నమోదు చేసి తండ్రి కోడుకులను రిమాండ్ కు పంపించారు. ఈ ఘటనలో యమున చేయి విరిగిందనే నేరారోపణ రుజువు కావడంతో ముద్దాయిలైన తండ్రికొడుకు రొడ్డ గంగరామ్ రొడ్డ ప్రశాంత్ లకు ఒక్కరికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమాన విధిస్తు నిజామాబాద్ ప్రత్యేక ప్రథమశ్రేణీ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) వడ్డి హరి కుమార్ గురువారం తీర్పు వెలువరించారు.జరిమానా చెల్లించని యెడల అదనంగా నెల రోజుల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.