కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు అబద్ధాలు 

బతుకమ్మ భిక్కనూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు అబద్దాలని భిక్కనూరు మండల బిజెపి అధ్యక్షులు ఉప్పరి రమేష్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోయిందని 6 గ్యారంటీలో నుంచి ఒక్క గ్యారెంటీ అది మహిళలకు ఉచిత బస్సు తప్ప దేనిని అమలు చేయడం లేదన్నారు. ఎంతమంది రైతులు రుణమాఫీ అయిందో ప్రభుత్వం చెప్పాలని ఏ మొఖం పెట్టుకొని ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు అంటున్న వారు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి అన్నారు....