Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 6:14 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు అబద్ధాలు 

బతుకమ్మ భిక్కనూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు అబద్దాలని భిక్కనూరు మండల బిజెపి అధ్యక్షులు ఉప్పరి రమేష్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోయిందని 6 గ్యారంటీలో నుంచి ఒక్క గ్యారెంటీ అది మహిళలకు ఉచిత బస్సు తప్ప దేనిని అమలు చేయడం లేదన్నారు. ఎంతమంది రైతులు రుణమాఫీ అయిందో ప్రభుత్వం చెప్పాలని ఏ మొఖం పెట్టుకొని ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు అంటున్న వారు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి తిరుమలేష్, శ్రీనివాస్ రెడ్డి ,బసవరెడ్డి యాదగిరి గౌడ్ మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలే లక్ష్మి, స్వామి, ప్రభాకర్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.