నాచుపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ
బాన్సువాడ, బతుకమ్మ : నస్రుల్లాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామంలోని ఆరు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ పనుల నిమిత్తం బయట గ్రామాలకు వెళ్లిన కుటుంబాల ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆయా ఇళ్లల్లో నగదు, బంగారం, వెండి ఆభరణాలు,...