Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 6:35 pm Posted by : ramakrishna

ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి

  • ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు

 

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో 100%ఆరు గ్యారంటీలు అమలు చేయాలని శనివారం ఎమ్మార్వోకు సునీతకు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం తెలంగాణ ప్రజలకు పథకాల పేరుతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పట్టించుకోకుండా పోయిందని నామమాత్రపు 6 గ్యారంటీల పథకాలు అమలు చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను మర్చిపోయిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు కనీసం 30% కూడా పూర్తిస్థాయిలో చేయకపోగా తామేదో రైతుల కోసం పోరాటం చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.రైతులు యూరియా బస్తాల కోసం తిండి తినక రేయింబవళ్లు సొసైటీల చుట్టూ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి లో భాగంగా తులం బంగారం ఇస్తానని ఇవ్వకపోగా మహాలక్ష్మి లో భాగంగా 2500 ఇవ్వకుండా తెలంగాణ ఆడపడుచులను మోసం చేస్తున్నారన్నారు.పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అత్తిలి తిరుమలేష్, పొన్నాల రంజిత్, కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి ,జిల్లా జనరల్ సెక్రెటరీ నరేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బసవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, హరేంద్ర, పవన్ మండల బిజెపి కార్యకర్తలు ఉన్నారు.