డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఆరుగురుకి జైలు
నిజామాబాద్, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి ఆరుగురుకి జైలు శిక్ష, 14 మందికి జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం 20 మంది మద్యం సేవించిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం వీరిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జా హన్ ముందర హాజరుపర్చగా.. ఇందులో ఆరుగురికి జైలు శిక్ష, 14 మందికి రూ. 10,000 చొప్పున జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ వెల్లడించారు.