మాల్ ప్రాక్టీస్ కు యత్నించిన ఆరుగురి అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ : పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 64 సెంటర్లలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జుక్కల్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ సెంటర్ లో కొంత మంది మాల్ ప్రాక్టీస్ కు యత్నించారని తెలిపారు. డీఈఓ, పోలీసులు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారని తెలిపారు. ఇందులో కీలక పాత్ర పోషించిన ఆరుగురిని అరెస్ట్ చేసి సీసీఎస్-1, సీసీఎల్ -2 జువైనల్ కోర్టులో హాజరు పరిచినట్లు...