న్యాల్కల్ రోడ్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులపై స్థల పరిశీలన
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 7వ డివిజన్ ప్రజల అభ్యర్థన మేరకు నుడా చైర్మన్ కేశ వేణు బుధవారం న్యాల్కల్ రోడ్‌లో ప్రతిపాదిత స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో తరచూ ఎదురయ్యే నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. వర్షపు నీరు ఎలాంటి అవరోధాలు లేకుండా సక్రమంగా పారిపోయే విధంగా సమర్థవంతమైన డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన...