నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
7వ డివిజన్ ప్రజల అభ్యర్థన మేరకు నుడా చైర్మన్ కేశ వేణు బుధవారం న్యాల్కల్ రోడ్‌లో ప్రతిపాదిత స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో తరచూ ఎదురయ్యే నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. వర్షపు నీరు ఎలాంటి అవరోధాలు లేకుండా సక్రమంగా పారిపోయే విధంగా సమర్థవంతమైన డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, సాంకేతిక నిపుణుల సూచనల మేరకు ఉత్తమ ప్రణాళికను రూపొందించి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ స్థల పరిశీలనలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు రామర్తి గోపి, జిల్లెల రమేష్, ధర్మారం అవిన్ తదితరులు పాల్గొన్నారు.