సోషలిస్టు వ్యవస్థ కోసం సీతారాం నిరంతరం కృషి చేశారు
. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశంలో మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతూ, కమ్యూనిస్టు సిద్ధాంతాల ఆధారంగా సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కోసం సీతారాం ఏచూరి నిరంతరం కృషి చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి 74వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి...