సీతారాముల కళ్యాణ మహోత్సవం

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో శ్రీరామ భక్త మండలి ఆధ్వర్యంలో చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీరాముల గుడి వద్ద శ్రీరామ నవమి సందర్భముగా శ్రీ సీతారాముల ఆలయమును ప్రత్యేకంగా అలంకరణ చేసి సీతారాముల కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ రాముల గుడి వద్ద భక్తమండలి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల కొరకు  టెంట్లు వేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలు పాల్గొని సీతారామ కళ్యాణం తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.