Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 8:53 pm Posted by : ramakrishna

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

 

. . . కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి లో సీతారామ చంద్ర స్వామి కల్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హాజరయ్యారు. శ్రీ రామ నవమి సందర్భంగా భక్తజన సందోహం నడుమ, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సీత రాముల పెండ్లి వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను కన్నులారా చూసేందుకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో సీతారాముల ఆలయా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల లైట్లలో ఆలయాన్ని అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్, వైస్ చైర్మన్ రఘుపతి, సభ్యులు గ్రామ సర్పంచ్ లోకని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస గౌడ్, గ్రామ ప్రముఖులు, వేద పండితులు కందాలై రాజగోపాల చారీ, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

 

Sita and Rama's wedding in grandeur