Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 7:11 pm Posted by : ramakrishna

ఘనంగా సీతారాముల కళ్యాణం

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూర్ మండలంలోని సిద్ధ రామేశ్వర్ నగర్ గ్రామంలో హనుమాన్ సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సీతారాముల కళ్యాణ మహోత్సవం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కొరకు ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు సీతారాముల విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ  ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.