ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడప్

హైదరాబాద్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడప్ చేసింది.  కేసులో ఉన్నవాళ్లను వరుసగా సిట్  విచారణకు పిలుస్తుంది. శుక్రవారం ప్రణీత్‌రావు, శనివారం ప్రభాకర్ రావు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి ప్రణీత్‌రావు మూసీలో పారేసిన విషయం తెలిసిందే. ఎవరి ఆదేశాలతో హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారనే అంశంపై సిట్ విచారణ జరపనుంది. హార్డ్ డిస్క్ ల ధ్వంసం వెనుక ప్రభాకర్ రావు ఉన్నట్లు అనుమానాలు వ్యక్త...