వెబ్ డెస్క్, బతుకమ్మ :
రాఖీ పౌర్ణమి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం బాన్సువాడ పట్టణంలోని తన స్వగృహంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి సోదరీమణి దొడ్ల సత్యవతి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని ఆయన తెలిపారు.ఈ రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
. . . అర్బన్ ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళా మోర్చ
రాఖి పండగ సందర్బంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖి వేడుకల్లో బిజెపి మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాకి రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విదంగా కేవలం మన భారత దేశంలో సోదరాభావానికి ప్రతీకగా దేశం అంతట రాఖి పండుగ జరుపుకోవడం మన సోదర భావానికి నిదర్శమన్నారు. ఇది అనాది కాలంగా వస్తుందని భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర సంస్కృతి, సాంప్రదాయలు కలిగి ఉందన్నారు. చిన్నప్పటి నుండే పిల్లలో సోదరాభావన్నీ, దేశ భక్తిని నింపే ఇలాంటి సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను భావి తరాలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పంచరెడ్డి ప్రవళిక, మమతా, ఇందిరా, సుమిత్ర, హేమలత, వనిత, జ్యోతి, వరలక్ష్మి, న్యాలం రాజు, నాగొల్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, నారాయణ యాదవ్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
. . . అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళ ప్రతీక రాఖీ పండుగ…
అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అనుబంధాలకు గుర్తుగా నిర్వహించుకునే పండగ రక్షాబంధన్. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండగను ప్రజలంతా నిర్వహించుకుంటారు. రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చెల్లెల్లు అన్నలకు,అక్కలు తమ్ముళ్లకు రాఖీ కడుతూ పండుగ శుభాకాంక్షలు తెలిాపారు.

. . . మాజీ జడ్పీటీసీ జగన్ కు రాఖీ కట్టిన మహిళ నాయకురాలు
ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ కు ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన తేలు సరిత పటేల్ రాఖీ కట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా రాఖీ పండుగ సందర్భంగా బాజిరెడ్డి జగన్ కు రాఖీ కడుతున్నట్లు తెలిపారు.
