Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2025, 8:37 pm Posted by : ramakrishna

అక్కా.. మీ వల్లనే మా భూముల పరిహారం రూ.20 లక్షలకు పెరిగింది

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కొడంగల్ – నారాయణపేట్ ఎత్తిపోతల నిర్వాసిత రైతుల కృతజ్ఞతలు
  • తమ సంతకాలతో లేఖలు రాసిన పలువురు రైతులు

 

హైదరాబాద్, బతుకమ్మ : అక్కా.. మీ వల్లనే మా భూముల పరిహారం రూ.20 లక్షలకు పెరిగిందని, కొడంగల్ – నారాయణపేట్ ఎత్తిపోతల నిర్వాసిత రైతులు తమ సంతకాలతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేఖలు రాశారు. జూలై 31న నారాయణపేట్ జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్షించారు. నిర్వాసిత రైతులకు ఎకరానికి రూ.14 లక్షలకు బదులుగా రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం పెంచే వరకు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానుకుర్తి రైతులను పోలీసులు నిర్బంధంలో పెట్టి బలవంతంగా భూములు లాక్కునే ప్రభుత్వ ప్రయత్నాలను కవిత బయట పెట్టింది. కల్వకుంట్ల కవిత ఒత్తిడి, రైతుల పోరాటానికి దిగివచ్చిన ప్రభుత్వం, నిర్వాసిత రైతులకు ఒక్కో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో కల్వకుంట్ల కవితకు నిర్వాసిత రైతుల కృతజ్ఞతలు తెలిపారు.