Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 6:59 pm Posted by : ramakrishna

ఏఐయుకెయస్ జిల్లా బాడీలో సిరికొండ నాయకులకు చోటు

  • సేవను గుర్తించి పట్టం కట్టిన అది నాయకత్వం

 

సిరికొండ, బతుకమ్మ : విప్లవ రైతుకూలీ సంఘానికి కంచుకోటగా నిలిచిన సిరికొండ మారుమూల మండలానికి గుర్తింపు దక్కింది. 1974 నుండి ఏ. పీ రైతు కూలీ సంఘం నుండి ఈ ప్రాంత నాయకులు పనిచేయగా వారి సేవలను గుర్తించి వారికి దేశ వ్యాప్తంగా పని చేసేందుకు ఇటువలే నూతనంగా ఆవిర్భావించి అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ యు కె యస్) లో ముగ్గురు నాయకులకు ఆదినాయకత్వం చోటు కల్పించింది. ఇటీవలే మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన నిజామాబాద్, కామరెడ్డి జిల్లాల సంయుక్త సమావేశం లో ఏ ఐ యు కె యస్ జిల్లా బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అందులో సిరికొండ మండలం లోని రావుట్లకు చెందిన బి. బాబాన్న ను జిల్లా జనరల్ సెక్రటరీగా, అదే రావుట్లకు చెందిన రిక్క దామోదర్ ను జిల్లా సెక్రటరీగా, గడ్కోల్ గ్రామానికి చెందిన మలికి లింబాద్రిని ట్రెజరర్ గా ఎన్నుకొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అది నాయకత్వం మాపై  నమ్మకం ఉంచి మాకు కట్టబెట్టిన పదవులు మరింత భాద్యతను పెంచాయన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవసాయ, కార్మిక, కర్షకుల కోసం విధిగా సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తామన్నారు. సేవలను గుర్తించిన అది నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Sirikonda leaders get a place in AIUKS district body

Sirikonda leaders get a place in AIUKS district body