ఇస్రోలో శిక్షణకు సిరిసిల్ల యువకుడు వీఎస్‌ఎస్‌సీలో సిరిగిరి తేజస్విన్ వర్మ ఎంపిక

  . . . . ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ప్రతిభకు దక్కిన అవకాశం సిరిసిల్ల, బతుకమ్మ :  అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సిరిసిల్ల యువకుడు సిరిగిరి తేజస్విన్ వర్మ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ , తిరువనంతపురంలో ఏరోస్పేస్ ఇంజనీర్గా గా ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు వీఎస్‌ఎస్‌సీ అధికారులు తేజస్విని వర్మకు ఆఫర్ లెటర్ అందజేశారు. చెన్నై ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన సిరిసిల్ల పట్టణానికి చెందిన...