Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 2:22 pm Posted by : ramakrishna

ఇస్రోలో శిక్షణకు సిరిసిల్ల యువకుడు వీఎస్‌ఎస్‌సీలో సిరిగిరి తేజస్విన్ వర్మ ఎంపిక

 

. . . . ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ప్రతిభకు దక్కిన అవకాశం

సిరిసిల్ల, బతుకమ్మ : 

అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సిరిసిల్ల యువకుడు సిరిగిరి తేజస్విన్ వర్మ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ , తిరువనంతపురంలో ఏరోస్పేస్ ఇంజనీర్గా గా ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు వీఎస్‌ఎస్‌సీ అధికారులు తేజస్విని వర్మకు ఆఫర్ లెటర్ అందజేశారు. చెన్నై ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన సిరిసిల్ల పట్టణానికి చెందిన తేజస్విని వర్మ చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసిన అనంతరం ఏరోస్పేస్ రంగంలో తన ప్రతిభను చాటుకునే దిశగా ముందుకు సాగుతున్న ఆయనకు ఇస్రోలోని వీఎస్‌ఎస్‌సీలో శిక్షణకు ఎంపిక కావడం కీలకమైన మైలురాయిగా నిలిచింది. సిరిసిల్లకు చెందిన యువకుడు దేశంలోని ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థలో శిక్షణకు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. తేజస్విని వర్మ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. యువతకు ఆయన ఎంపిక స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.