Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 7:39 pm Posted by : ramakrishna

13వ వార్డు టీచర్స్ కాలనీలో 100 శాతం పూర్తైన ఎస్‌ఐఆర్

 

. . . కౌన్సిలర్‌ కోఆప్షన్ కు కాలనీవాసుల సన్మానం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీ పరిధిలోని 227వ పోలింగ్ బూత్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ విజయవంతంగా వంద శాతం పూర్తయిన సందర్భంగా కాలనీవాసులు వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలేఖ్ ,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖమర్ గౌస్ పాషా, బీఎల్‌ఏలను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మహమ్మద్ ఖలేఖ్ మాట్లాడుతూ 227వ బూత్ పరిధిలో మొత్తం 703 ఎన్యూమరేషన్ ఫారాలు ఉండగా, వాటిలో 593 ఫారాలను విజయవంతంగా డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. మిగిలిన 110 ఫారాలు డబుల్ ఓట్లు, నివాస మార్పు మరణించిన వారి పేర్లకు సంబంధించినవని వివరించారు.టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయడంలో కృషి చేసిన బీఎల్‌ఓ వాణి , కపిల్ లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను అభినందించారు.