. . . ఆర్టీసీ యాజమాన్యం నీటి సదుపాయం కల్పించాలని కోరుతున్న ప్రయాణికులు
ఇందల్ వాయి, బతుకమ్మ
ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్ వాయి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇందల్ వాయి ఆర్టీసీ బస్టాండ్ ఎన్ హెచ్ 44 హైవే రోడ్డుకి ఆనుకుని ఉండడంతో ప్రయాణ ప్రాంగణం నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల సౌకర్యార్థం ఎండల తీవ్రతలు దృష్టిలో పెట్టుకొని ప్రయాణ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహాన్ని తీర్చాలని వారు కోరుతున్నారు. నిత్యం హైదరాబాద్ నుండి నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, అలాగే నిజామాబాద్ నుండి ఇందల్ వాయి, ధర్పల్లి, సిరికొండ, భీమ్ గల్ ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు అధిక సంఖ్యలో బస్టాండ్ లోకి వస్తుంటారు. దీంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఆర్టీసీ యాజమాన్యాన్ని వారు కోరుతున్నారు.