Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 5:35 pm Posted by : ramakrishna

పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించడం కోసమే ఎస్ ఐ ఆర్

 

. . . ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించడం కోసమే కేంద్రీయ ఎన్నికల కమిషన్ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ చేపట్టిందని ఎల్లారెడ్డి ఆర్టీవో ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని పోలింగ్ నెంబర్ 252 లో బి ఎల్ ఓ ఎన్యుమరెషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎస్ ఐ ఆర్ సర్వే కోసం వచ్చే బిఎల్ఓ లకు సహకరించి పారదర్శకమైన ఓటర్ జాబితా తయారీ కోసం సహకరించాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకమైన ఓటరు జాబితా అవసరమని అన్నారు. ఈ ప్రక్రియ జులై 24 వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు.