Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 6:24 pm Posted by : ramakrishna

గడువులోగా ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయాలి

 

. . . తహసీల్దార్ బాలయ్య

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్ బాలయ్య అన్నారు. మంగళవారం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆయన ప్రభుత్వాధికారులు ప్రశ్నించే లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తీర్మాన్ పల్లి, కేకే తాండ, నల్లబెల్లి, గౌరారం, ఇందల్వాయి, అన్నారం గ్రామాలలో విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తీర్మాన్ పల్లి గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతల కిషన్, ఇందల్వాయి సర్పంచ్ లోకాని గంగమణి గంగారాం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, అన్నారం సర్పంచ్ సుజాత శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు భరత్, కారోబర్ పోచయ్య, బిఎల్వోలు, జిపిఓలు, తదితరులు పాల్గొన్నారు.

 

SIR forms must be completed within the deadline.