ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ 

 సమగ్ర నివేదిక సమర్పిస్తామని జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ వెల్లడి    బతుకమ్మ, నిజామాబాద్ : షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ తో కూడిన ఏక సభ్య కమిషన్ గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లో బహిరంగ విచారణ నిర్వహించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రజాప్రతినిధులు,గెజిటెడ్,నాన్ గెజిటెడ్ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,వైద్యులు,న్యాయవాదులు,షెడ్యూల్డు కుల సంఘాల నాయకులు,వివిధ వర్గాల వారి నుండి వినతులు స్వీకరించి,వర్గీకరణపై అభిప్రాయాలను...