రెండు, మూడు రకాల భూ సమస్యలకు ఒకే దరఖాస్తు
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాదాపూర్, నల్లూర్, కిసాన్ నగర్ రెవెన్యూ సదస్సులలో పాల్గొన్న కలెక్టర్ నిజామాబాద్, బతుకమ్మ : ఒకే దరఖాస్తులో రైతులు రెండు, మూడు రకాల భూ సమస్యలను పేర్కొనవచ్చని, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆన్లైన్ లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం జక్రాన్పల్లి మండలం మాదాపూర్, ముప్కాల్ మండలం నల్లూర్, కిసాన్ నగర్ గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో...