వందేమాతరం గీతాలాపన..
రుద్రూర్, బతుకమ్మ: వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వందేమాతరం సామూహిక గీతాలాపన చేశారు. ఈ సందర్బంగా ఎస్సై సాయన్న, బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనదేనని అన్నారు. మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదంలా నిలిచింది వందేమాతరం అని పేర్కొన్నారు. బంకిమ్చంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని, ...