Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 7:20 pm Posted by : ramakrishna

కార్మిక ఉద్యమానికి సింఘ్వి మృతి తీరని లోటు

సిరికొండ, బతుకమ్మ : కార్మిక ఉద్యమ నేత,సీ పీ ఐ (ఎం. ఎల్) మాస్ లైన్ పొలిటిబ్యోరో మెంబర్, టీయుసీఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సంజయ్ సింఘ్వి మృతి కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని సీపీఐ (ఎం. ఎల్)మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. రమేష్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో సంజయ్ సింఘ్వి చిత్రపటానికి పూలమాల వేసి, మౌనం పాటించి నివాళులు, జోహారలర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముంబై సింధూజ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సింఘ్వి రాత్రి 10 గంటలకు మృతి చెందారని తెలిపారు.గత 40 సంవత్సరాలకు పైగా ఆయన విప్లవ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారన్నారు.సింఘ్వి ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ రివాల్యూషనరి పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్ (ఐ సీ ఓ ఆర్)ఆసియ కోఆర్డినేటర్ గా, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీ యు సీ ఐ)ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గా పని చేసారన్నారు. కామ్రేడ్ సింఘ్వి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని రమేష్ కోరారు. ఈ కార్యక్రమం లో సీపీఐ (ఎం. ఎల్)మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, జీ. సాయరెడ్డి, మండల నాయకులు బి. కిషోర్, జీ. ఎఱ్ఱన్న, ఎస్. కిషోర్, ఎల్. నరేష్, ఎం. డీ ఖధీర్ తదితరులు పాల్గొన్నారు.