ఇన్ చార్జి సీపీగా సింధూశర్మ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ ఇన్ చార్జి పోలీస్ కమిషనర్ గా కామారెడ్డి ఎస్పీ సింధూశర్మకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీ కల్మేశ్వర్ కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ వెళ్తుండడం, శనివారం ఆయన రిలీవ్ అవుతుండడంతో సింధూశర్మకు కమిషనరేట్ బాధ్యతలు అప్పగించారు.