Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2025, 9:24 pm Posted by : ramakrishna

సినారే అవార్డు బాధ్యతను రెట్టింపు చేసింది

  • అవార్డు గ్రహీత డాక్టర్. వి.శంకర్

 

భీమ్ గల్, బతుకమ్మ : సాహిత్య రంగంలో విశేష కృషిని గుర్తించి ప్రతి యేటా సాహిత్య ప్రముఖులకు అందించే సినారే అవార్డుకు తనను ఎంపిక చేయడం  వల్ల తనకు సాహితి సేవలో రెట్టింపు బాధ్యత పెరిగిందని సీనారే అవార్డు గ్రహిత డాక్టర్. వి. శంకర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ యదాద్రి భువనగిరి ఆడిటోరియం లో భువనగిరి రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సినారే సాహిత్య పురస్కారం కార్యక్రమంలో హై కోర్ట్ జడ్జ్ జస్టిస్. కె. లక్ష్మణ్ చేతుల మీదుగా సినారే పురస్కారాన్ని అందుకోవడం తనకు ఎనలే ఆనందాన్ని ఇచ్చిందన్నారు.సినారే సాహిత్యం అజరామమైందని, ఆయన సాహితి చాలా గొప్పదని ఆయన అన్నారు. అంతటి గొప్ప సాహితి వేత్త, పద్మభూషన్, జ్ఞానాపీట పురస్కార గ్రహీత, మహా కవి డాక్టర్. సి. నారాయణ రెడ్డి (సినారే) జయంతి సందర్బంగా ఆయన పేరు మీద అవార్డు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.