హైదరాబాద్, బతుకమ్మ : బీర్ బాటిల్ లో సిల్వర్ పేపర్ కనిపించింది.ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ అన్నోజిగూడలోని ఓ వైన్ షాప్ లో కస్టమర్ బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. తాగుదామని బీర్ బాటిల్ ను పరిశీలించగా బాటిల్ లోపల సిల్వర్ పేపర్ ఉన్నట్లు గుర్తించాడు. ఈవిషయమై వైన్ షాప్ యజమానిని కస్టమర్ నిలదీయగా తమకు తెలియదని సమాధానం ఇచ్చాడు.