సుబ్రహ్మణ్యస్వామికి వెండి మయూరి కిరీటం బహుకరణ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలంలోని బోర్గాం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి భక్తుడు చింతకాయల రాజేందర్ 1.1/2 వెండితో నెమలి కిరీటం తయారు చేసి స్వామివారికి సమర్పించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆలయంలో ప్రతేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అర్చన, అభిషేకం అనంతరం మయూర కిరీటాన్ని ఎమ్మెల్యే చేతులమీదుగా సుబ్రహ్మణ్య స్వామికి బహుకరించారు. ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ మనిషి ఎదుగుదలకు ఆధ్యాత్మికం ఎంతో అవసరమని "ఇటువంటి పూజా కార్యక్రమాలు మన సంప్రదాయాల గొప్పతనాన్ని...