Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 5:30 pm Posted by : ramakrishna

కుంభమేళాను తలపించేలా రజతోత్సవ వేడుకలు

  • ప్రజల కోసం పనిచేసిన పార్టీ బిఆర్ఎస్
  • నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రజతోత్సవ వేడుకల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల  సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విలేకరుల సమావేశంలో రజతోత్సవ సభను ఉద్దేశించి మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న రజతోత్సవ సభ కుంభమేళను తలపించేలా ఉందని అన్నారు. దేశం మొత్తం తెలంగాణలో నిర్వహించే రజతోత్సవ వేడుకను చూసేందుకు తహతహలాడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలోని రాష్ట్ర ప్రజలు రజతోత్సవ వేడుకకు స్వచ్ఛందంగా వచ్చేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారని తెలిపారు. తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన ప్రాణాలను లెక్కచేయకుండా తెలంగాణను తీసుకువచ్చారని తెలిపారు. ఉద్యమం నుంచి వెనక్కి వస్తే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిన మాట గుర్తు చేశారు. దేశంలో తెలంగాణను 29వ రాష్ట్రంగా తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది. పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేసిన పార్టీగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, 24 గంటల విద్యుత్ అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కరోనా విపత్తు వల్ల సంక్షోభం ఏర్పడిన పెన్షన్లు ఆగలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

Silver Jubilee celebrations reminiscent of Kumbh Mela

  • బిఆర్ఎస్లో  భారీగా చేరికలు..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 35వ డివిజన్ సంబంధించిన నరేష్ ఆధ్వర్యంలో వందమంది యువకులు బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని పార్టీలో చేరినట్లు తెలిపారు.

  • గులాబీ టీషర్టులతో కార్యకర్తల హంగామా..

రజతోత్సవ వేడుకల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు మరియు కార్యకర్తలు గులాబీ టీ షర్ట్లు వేసుకొని హంగామా చేశారు. డీజే పాటలు పెట్టుకుని డాన్సులు వేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు కార్యకర్తలతో స్టెప్పులు వేశారు. సారే రావాలి మళ్లీ కెసిఆర్ రావాలి అంటూ పాటలతో కేకలతో అదరగొట్టారు. అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు చేశారు.

Silver Jubilee celebrations reminiscent of Kumbh Mela