బోధన్,బతుకమ్మ : బోధన్ మండలంలో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఉద్యోగం కోసం ఫ్యామిలీ సర్టిఫికెట్ గురించి ఈ సంతకం ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఈ సర్టిఫికెట్‌లో తహసీల్దార్ సంతకంతో అది పట్టణ మున్సిపాలిటీలో ఉపయోగించబడినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పలువురు తహసీల్దార్‌ను వివరణ కోరగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని మిగతా వివరాలను విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటామని ఈ చర్యకు పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.