నిజామాబాద్ డీఎఫ్ వోగా బాధ్యతలు స్వీకరించిన సిద్దార్థ్ విక్రమ్ సింగ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అటవీ అధికారిగా సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నిజామాబాద్ డీఎఫ్ వో కార్యాలయంలో ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో అటవీ సంరక్షణ, వన్యప్రాణులను కాపాడడమే మొదటి ప్రాధాన్యత అన్నారు. రిజర్వు అటవి ప్రాంతాన్ని ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణ చేస్తానని, అక్రమంగా వనాలను నరికివేతకు అడ్డుకట్ట వేయడం, క్షేత్రస్థాయిలో నిఘాను పెంచుతామన్నారు. వన్యప్రాణులు అటవీ శివారు ప్రాంతాల్లో సంచారం...