భక్తుల శివనామస్మరణలతో మారుమోగిన సిద్దరామేశ్వరాలయం

  భిక్కనూరు, బతుకమ్మ:   భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సిద్ద రామేశ్వర స్వామి స్వయంభు లింగ మహాక్షేత్రంలో చైత్రమాసం కృష్ణ ఏకాదశి సోమవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు, పుట్టువెంట్రుకలు వంటి కైంకర్యాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన...