ఎస్సై వెంకటేశ్వర్లు రిమాండ్
సిద్దిపేట్, బతుకమ్మ : పట్టుకున్న ఇసుక లారీని విడిచి పెట్టేందుకు 20 వేలు లంచం తీసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లును అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్టు చేశారు. సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు రిమాండ్ కు తరలించారు. ఎస్సై వెంకటేశర్లు 15 వేలు యూపిఐ పేమెంట్ ద్వారా లంచం తీసుకున్నట్టు రుజువైందన్నారు. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో పని చేసిన ఎస్సై వెంకటేశ్వర్ల పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.