రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న ఎస్సై సందీప్
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల పరిధిలో తెల్లవారుజామున లింగాపూర్ వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఎస్సై సందీప్ పట్టుకున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారం వచ్చిందని, వెళ్లి చూడగా అక్కడ రెండు ట్రాక్టర్లు ఇసుక లోడ్ నింపుకొని తరలించడానికి చూస్తున్నాయని ఎస్సై అన్నారు. ట్రాక్టర్ లను, డ్రైవర్లను పట్టుకొని విచారించగా ఎటువంటి అనుమతులు లేకపోవడంతో రెండు ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగిందని ఎస్సై సందీప్ తెలిపారు. ఇసుకకు సంబంధించి ఎలాంటి...